ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అందజేయాలి' - ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తాజా వార్తలు

అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అందజేయాలని గుంటూరు జిల్లా నరసరావుపేట భాజాపా పార్లమెంటరీ నియోజకవర్గ భాజపా అధ్యక్షుడు సబ్ కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

bjp leaders conference on ews reservation
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్

By

Published : Oct 19, 2020, 11:13 PM IST

అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్​ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నరసరావుపేట భాజాపా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీకర్ణ ఆమర సైదారావు అన్నారు. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో స్థానిక భాజాపా సభ్యులు నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్​కు వినతిపత్రం అందజేశారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయకపోవడం శోచనీయమన్నారు.

గత ప్రభుత్వ హయాంలో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేశామని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి కృష్ణమోహన్ అన్నారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అగ్రవర్ణ పేదలకు తప్పనిసరిగా రిజర్వేషన్ కల్పిస్తామని మాటిచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చి అగ్రవర్ణ పేదల పొట్టగొడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details