- చిత్తూరు జిల్లాలో..
మంత్రి కొడాలి నానిని అరెస్టు చేయాలని శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుటు భాజపా, జనసేన నేతలు డిమాండ్ చేశారు. హిందూ దేవుళ్ల వేషధారణతో నేతలు ర్యాలీ నిర్వహించారు. దేవాలయాలను హేళన చేస్తూ, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి మాట్లాడటం బాధాకరమని అన్నారు. మంత్రి కొడాలి నానిని అరెస్టు చేయాలని కోరుతూ.. తహసీల్దార్ జరీనాబేగంకు వినతిపత్రం అందజేశారు.
కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. చిత్తూరు జిల్లా మదనపల్లెలో భాజపా నేతలు నిరసనకు దిగారు. భాజపా నాయకులు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టటంతో.. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుకు నిరసన భాజపా నాయకులు రోడ్డుపైనే బైఠాయించగా, సీఐ వారిని పక్కకు లాగే ప్రయత్నం చేశారు. దీంతో నాయకులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు దాడికి ప్రయత్నించారని నాయకులు ఆరోపించారు.
- గుంటూరు జిల్లాలో...
హిందూ దేవుళ్లు, ప్రధాని మోదీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా... గుంటూరు కలెక్టరేట్ ఎదుట భాజపా శ్రేణులు ధర్నా చేపట్టాయి. తక్షణమే మంత్రిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. మోదీని విమర్శించే నైతిక హక్కు, అర్హత కొడాలికి లేదంటూ.. భాజపా నేతలు విమర్శించారు. హిందూ సమాజం, దేవాలయాల పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడిన అతడిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
- విశాఖ జిల్లాలో..
హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే.. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విశాఖ జిల్లాలో భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా... నాయకులు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. మంత్రిగా ఉన్న కొడాలి నాని.. దేశ ప్రధాని పట్ల అనుచితంగా మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లపై అనుచితంగా మాట్లాడుతున్న మంత్రిపై సీఎం జగన్ చర్యలు తీసుకోకపోవటం దారుణమని అన్నారు. మంత్రి కొడాలి నానిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని.. విశాఖ జిల్లా నర్సీపట్నంలో భాజాపా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. సీఎం జగన్ పాలనలో హిందువులకు, ఆలయాలకు రక్షణ కరవయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- పశ్చిమ గోదావరి జిల్లాలో...