వైకాపా ప్రభుత్వం పరిపాలనలో విఫలమైందని భాజాపా నేత యడ్లపాటి రఘునాథబాబు ధ్వజమెత్తారు. ఇసుక సరఫరా చేయడంలో విఫలం చెందారని ఆయన మండిపడ్డారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో ఒక ట్రాక్టర్ ఇసుక రూ. 5వేలకు అందుబాటులో ఉంటే.. నేడు 10వేలు వెచ్చించాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇసుక అందుబాటులో లేక అసహనం వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులకు మేము వ్యతిరేకమని, హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని అన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని డిమాండ్ చేశారు. ఒకవేళా తరలించేందుకు ప్రయత్నిస్తే ...కేంద్రం జోక్యం చేసుకుంటుందని తెలిపారు.
'వైకాపా ప్రభుత్వం పాలనలో విఫలమైంది..' - అమరావతి ధర్నా వార్తలు
వైకాపా ప్రభుత్వం పరిపాలనలో విఫలమైందని భాజాపా నేత యడ్లపాటి రఘునాథబాబు ధ్వజమెత్తారు. ఇసుక సరఫరా చేయడంలో విఫలం చెందారని గుంటూరులో ఆయన మండిపడ్డారు.
భాజాపా నేత యడ్లపాటి రఘునాథబాబు