ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని.. విపక్షాల విజయంగా అభివర్ణించారు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి. ఇప్పటికైనా అధికార వైకాపా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని గుంటూరులో హితవు పలికారు.
సుప్రీం కోర్టు తలుపు తట్టకుండా కొత్త నోటిఫికేషన్‌కు అవకాశం ఇవ్వాలన్నారు. నిబంధనల మేరకు నాలుగు వారాల సమయం ఇచ్చి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయాలని.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.