కరోనా సమయంలో ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ అందించటంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి విమర్శించారు. ఆక్సిజన్ అందక.. అనంతపురం జిల్లా హిందూపురం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులు చనిపోయారని ఆరోపించారు.
'ఆక్సిజన్ సరఫరాలో వైకాపా ప్రభుత్వం విఫలం' - ఆక్సిజన్ కొరత విషయంలో వైకాపాపై భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం
కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో.. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. రోగులకు ఆక్సిజన్ సరఫరా విషయంలో.. వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి విమర్శించారు. అందువల్లే అనంతపురంలో కరోనా బాధితులు మరణించారని ఆయన ఆరోపించారు.
bjp leader fires on ycp over oxygen shortage
ప్రభుత్వాసుపత్రిలో కూడా ఆక్సిజన్ అందుబాటులో లేకపోవటం.. కచ్చితంగా ప్రభుత్వం, అధికారుల వైఫల్యంగా అభివర్ణించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
TAGGED:
oxygen shortage in state