ఎస్సీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వైకాపా ప్రభుత్వం దూరం చేస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ సునీల్ దేవ్‌ధర్ ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళలర్పించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్ల దేశంలో అనేక మంది సామాజిక న్యాయం పొందుతున్నారని సునీల్ చెప్పారు. రాజ్యాంగంలో కేవలం వెనుకబడిన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ కల్పించారని.. క్రిస్టియానిటీ ముసుగులో బీసీలకు సైతం ఈ ఫలాలు అందించేలా జగన్ ప్రభుత్వ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫలితంగా ఆ రిజర్వేషన్ ఫలాలను అనేక మంది ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం పెంచిన పన్నుల వల్ల అట్టడుగు వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
BJP: 'ఏస్సీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వైకాపా దూరం చేస్తోంది' - వైకాపాపై భాజపా నేత సునీల్ దేవ్ ధర్ కామెంట్స్
BJP Leader Sunil Deodhar on YSRCP: గుంటూరు జిల్లా మంగళగిగిలో డా.బీఆర్ అంబేడ్కర్‌కు భాజపా నేతలు ఘన నివాళులర్పించారు. భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ సునీల్ దేవ్‌ధర్ నేతృత్వంలో నేతలు.. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను తలుచుకున్నారు.
Sunil Deodhar comments on ysrcp