ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు.. సుగంధ ద్రవ్యాల్లా దొరుకుతున్నాయి' - భాజపా తాజా వార్తలు

రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు.. సుగంద ద్రవ్యాల్లా దొరుకుతున్నాయని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. వైకాపా హయాంలో సామాన్యుల జీవితాలు దుర్భరంగా మారాయని విమర్శించారు.

bjp leader fires on ysrcp government
bjp leader fires on ysrcp government

By

Published : Oct 8, 2021, 6:53 AM IST

గతంలో విద్యుత్ చార్జీలు పెంచారని చంద్రబాబు నాయుడుని నడిరోడ్డులో కాల్చిచంపాలని వ్యాఖ్యలు చేసిన జగన్.. నేడు అధికారంలోకి వచ్చి అదే విద్యుత్ చార్జీలు పెంచారని, ఆయనను ఏం చేయాలో ప్రజలే ఆలోచించుకోవాలని భాజపా జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ.. గుంటూరులో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సత్యకుమార్ వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైకాపా ప్రభుత్వంలో సామాన్యుల జీవితాలు ఆగమ్యగోచరంగా మారాయన్నారు. ఉపాధి హామీ నిధులను దారి మళ్లిస్తున్నారని.. చివరకి న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే కానీ జగన్ మేల్కోలేదన్నారు.

రాష్ట్రంలో యువత.. ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారని దుయ్యబట్టారు. సీఎం జగన్ తెలుగు విరోధి అని.. ఆయన విదేశాల్లో చదువుకోవడం వల్లే తెలుగుపై నిషేధం విధించారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ ఇచ్చిన డిక్షనరిలో గాడ్ అంటే క్రిష్టియన్ అని అర్థం వచ్చేలా ఉందని.. అ డిక్షనరీల్లో హిందువులకు స్థానం లేదా అని అయన ప్రశ్నించారు. కులాలను, మతాలను వేరు చేసి రాజకీయ లబ్ది పొందుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాల్లా దొరుకుతున్నాయని.. గంజాయి గల్లిగల్లిల్లో విచ్చలవిడిగా లభిస్తోందని ఆరోపించారు. హెరాయిన్ వ్యవహారంలో ప్రజా ప్రతినిధులకు సంబంధం ఉందని ప్రజలు అనుకుంటున్నారని తక్షణమే దీనిపై సీఎం స్పదించాలన్నారు. జగనన్న కడప జిల్లా పరువును తాకట్టు పెడుతున్నాడని ... సొంత జిల్లా వాసులే చెప్పుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఆటవిక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కావాలని ప్రజలు అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. బద్వేలు ఉప ఎన్నికలో పోటీచేస్తున్నామని.. ఎన్ని ఓట్లు వస్తాయని తమకు ముఖ్యం కాదని.. ప్రజల సమస్యల పైన పోరాటం చేయడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రాన్ని వైకాపా అరాచక పాలనా నుంచి రక్షించుకోవాలంటే భాజాపాతోనే సాధ్యమన్నారు.

ఇదీ చదవండి:Badvel by-poll: బద్వేలు ఉపఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్

ABOUT THE AUTHOR

...view details