రాష్టపతి అభ్యర్థిగా ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఎంపిక చేయలేదనే విషయంపై రాష్ట్రంలో అసత్య ప్రచారం జరుగుతోందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. రాష్ట్రంలో చాలామందికి వెంకయ్యపై అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందని దుయ్యబట్టారు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా, నాలుగు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా చాలా రకాల పదవులు చేపట్టారన్నారు. ఈ పదవులన్నీ భాజపా పార్టీ తనకు ఇచ్చిన అవకాశాలేనని వెంకయ్యనాయుడు పదేపదే చెప్పేవారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అసత్య ప్రచారంపై వెంకయ్య కూడా ఆవేదన చెందారని సత్యకుమార్ చెప్పారు. 70 ఏళ్ల తర్వాత రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఆయన చాలాసార్లు చెప్పారని గుర్తు చేశారు.
ఆ ప్రచారంపై వెంకయ్య కూడా ఆవేదన చెందారు: సత్య కుమార్ - ఉపరాష్ట్రపతి వెంకయ్యపై సత్యకుమార్ కామెంట్స్
BJP leader Satyakumar: రాష్టపతి అభ్యర్థిగా వెంకయ్యను ఎంపిక చేయలేదనే విషయంపై రాష్ట్రంలో అసత్య ప్రచారం జరుగుతోందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యునిగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా చేపట్టిన పదవులన్నీ పార్టీ ఇచ్చిన అవకాశాలేనని వెంకయ్యనాయుడు పదేపదే చెప్పేవారని గుర్తు చేశారు.
సత్య కుమార్