ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదల ఇళ్ల స్థలాల పంపిణీలో భారీగా వైకాపా నేతల అవినీతి: రావెల - ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ

వైకాపా నేతలు అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్నారని భాజపా నేత రావెల కిశోర్ బాబు విమర్శించారు. పేదలకిచ్చే ఇళ్ల స్థలాల విషయంలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు.

ravela kishore babu
ravela kishore babu

By

Published : Jun 27, 2020, 3:45 PM IST

ఇసుక, మద్యం మాఫియా రాష్టాన్ని అతలాకుతలం చేస్తున్నాయని భాజపా నాయకుడు రావెల కిశోర్ బాబు అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తోందని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.

వైకాపా నేతల అవినీతి, అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని రావెల అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో భారీ అవినీతికి తెరతీశారని ఆరోపించారు. అవినీతి రహిత పాలన ఒక్క భాజపాతోనే సాధ్యమని రావెల అన్నారు. వైకాపా అరాచకాలకు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని రావెల కిశోర్ బాబు విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details