పంట కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని భాజపా నాయకుడు పాటిబండ్ల రామకృష్ణ తప్పుబట్టారు. ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలు చేసి.. చివరికి మెలిక పెడుతున్నారని ఆరోపించారు. ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న రైతుల నుంచే కొనుగోలు చేస్తామని అనడం సరికాదన్నారు. విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సింది పోయి.. ఇబ్బంది పెట్టకుండా చూడాలన్నారు.
'పంట కొనుగోలుకు మెలికలెందుకు?'
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పంట కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగానే ఉన్నాయని భాజాపా నాయకుడు పాటిబండ్ల రామకృష్ణ వ్యాఖ్యానించారు. గుంటూరులో కొనుగోలు కేంద్రాల్లో రైతుల పంటను ప్రభుత్వం కొనాలని ఆయన డిమాండ్ చేశారు.
గుంటూరులో పంట కొనుగోలు కేంద్రాలు