ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నా పార్టీ మారుతారనే ప్రచారం.. రెండు రోజుల్లో స్పష్టత - భాజపా నేత కన్నా

BJP KANNA LAXMI NARAYANA : భాజపా రాష్ట్ర నాయకత్వంపై కొంతకాలం నుంచి అసంతృప్తిగా ఉన్న కన్నా.. కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. రెండు రోజుల్లో కన్నా రాజకీయ భవిష్యత్​పై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

BJP KANNA LAXMI NARAYANA
BJP KANNA LAXMI NARAYANA

By

Published : Oct 19, 2022, 3:39 PM IST

Updated : Oct 19, 2022, 9:36 PM IST

BJP KANNA LATEST NEWS : బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఓ ఇంటర్వ్యూలో పార్టీ అధిష్ఠానం వైఖరిపై కన్నా అసంతృప్తిని వెళ్లగక్కారు. జనసేనాని పవన్ కల్యాణ్​తో సమన్వయం చేసుకోవడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందంటూ స్పష్టం చేశారు. మాజీ మంత్రి కన్నా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. పలువురు కన్నా అనుచరులు ఆయన నివాసానికి వచ్చి కన్నాతో సమావేశమయ్యారు. మీడియా ప్రతినిధులతో కన్నా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రానున్న రెండ్రోజుల్లో కన్నా రాజకీయ భవిష్యత్తుపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు భావిస్తున్నారు.

Last Updated : Oct 19, 2022, 9:36 PM IST

ABOUT THE AUTHOR

...view details