ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్తెనపల్లిలో పోలీసులపై చిందులేసిన భాజపా నేత - BJP Leader Hulchal latest news

సత్తెనపల్లిలో భాజపా నేత మద్యం మత్తులో పోలీసులపై చిందులేశారు. రోడ్డుపై కారు ఆపడంతో అక్కడనుంచి తీయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. దీనికి కోటేశ్వరరావు పోలీసులపై ఆగ్రహం వెలిబుచ్చారు.

BJP Leader Hulchal in Sattenapalli
సత్తెనపల్లిలో పోలీసులపై చిందులేసిన భాజపా నేత

By

Published : Oct 20, 2020, 10:31 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో భాజపా నేత మద్యం మత్తులో పోలీసులపై చిందులేశారు. భాజపా మండల అధ్యక్షుడిగా ఉన్న మట్టం కోటేశ్వరరావు... రోడ్డుపై కారు ఆపడంతో అక్కడనుంచి తీయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. దీనికి కోటేశ్వరరావు పోలీసులపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఆయన అప్పటికే మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా అతనికి పరీక్ష చేశారు. అనంతరం కోటేశ్వరరావుని పోలీస్​స్టేషన్​కు తరలించారు. సత్తెనపల్లి గడియార స్తంభం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇదీ చదవండీ... మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం : సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details