గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్ర బాధ్యులు సునీల్ వి దియోధర్, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. వారికి కాషాయ కండువా కప్పి ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ 55 ఏళ్లలో చేయలేని పనులను భాజపా 5 ఏళ్లలో చేసిందని సునిల్ చెప్పారు. తమతో పొత్తును వీడి విషప్రచారం చేయటం వల్లే చంద్రబాబు ఓడిపోయారన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భాజపా సభ్యత్వ నమోదుకు ప్రజల మంచి స్పందన వస్తోందని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.
''వాళ్లు 55 ఏళ్లలో చేయలేనిది.. మేం 5 ఏళ్లలో చేశాం''
భాజపా సభ్యత్వ సమోదు కార్యక్రమం సంఘటన పర్వ్ -2019... రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 200 మంది.. పార్టీలో చేరారు.
భాజపా