BJP candidates for MLC elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు వివిధ పార్టీలు తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తమ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న అభ్యర్థులను ఎంపిక చేసింది.
ఏపీ, తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు పట్టభద్రుల స్థానానికి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డిని ఎంపిక చేయగా.. కడప - అనంతపురం - కర్నూలు స్థానానికి నగరూరు రాఘవేంద్రని, శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం స్థానానికి పీవీఎన్ మాధవ్‌ను భారతీయ జనతా పార్టీ ఎంపిక చేసింది.