ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అటల్ బిహారీ వాజ్ పేయీకి నివాళులర్పించిన కన్నా లక్ష్మీ నారాయణ - కన్నా లక్ష్మీ నారాయణ తాజా వార్తలు

ప్రధాని మోదీని రాజకీయంగా ఎదుర్కొలేక... రైతు చట్టాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. మార్కెట్ యార్డు సెస్ చెల్లించకుండానే... రైతు తన వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా విక్రయించుకోవచ్చునని తెలిపారు. మార్కెట్ సెస్ అత్యధికంగా విధించే రాష్ట్రాలలో పంజాబ్ దే మొదటిస్థానం అన్నారు.

kanna lakshmi narayana
అటల్ బిహారీ వాజ్ పేయికి నివాళులు అర్పించిన కన్నా లక్ష్మీ నారాయణ

By

Published : Dec 25, 2020, 6:53 PM IST

గుంటూరు భాజపా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్​ పేయీ జయంతి కార్యక్రమంలో ఆ పార్టీ మాజీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. భారతరత్నఅటల్ బిహారీ వాజ్‌పేయీ చేసిన సేవలు మరువలేనివని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని ప్రపంచ స్థాయిలో సమున్నత స్థాయిలో నిలపడానికి వాజ్​పేయీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రముఖ నగరాలను అనుసంధానిస్తూ... స్వర్ణ చతుర్భుజిని ప్రారంభించారు. కార్గిల్ యుద్ధ సమయంలో దేశ సత్తా చాటారని గుర్తుచేశారు.

ప్రధాని మోదీ వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా తీసుకువచ్చిన మూడు చట్టాలపై ప్రతిపక్షాలు ద్రుష్పచారం చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్ యార్డు సెస్ చెల్లించకుండానే రైతు తన వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా విక్రయించుకోవచ్చునని తెలిపారు. మార్కెట్ సెస్ అత్యధికంగా విధించే రాష్ట్రాలలో పంజాబ్ దే మొదటిస్థానం అన్నారు. ప్రస్తుత ఉద్యమాలన్నీ రైతు వ్యతిరేక ఉద్యమాలేనని కన్నా వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details