ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కన్నా - andrapradesh
మోదీ సారథ్యంలో దేశం పరుగులు పెడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అందుకే ప్రజలు మళ్లీ మోదీకి పట్టం కట్టారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కన్నా
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దాన్ని అందిపుచ్చుకోవటంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఎదగనీయకుండా చంద్రబాబు నాయుడు రెండుసార్లు అడ్డుపడ్డారన్నారు. గుంటూరులోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో తెదేపా, జనసేనకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నేతలు కన్నా సమక్షంలో బిజెపిలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి బిజెపిలోనికి ఆహ్వానించారు.