మూడో విడత రేషన్ పంపిణీకి బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కారణంగా గత రెండు విడతల్లో బయోమెట్రిక్ విధానం నుంచి మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం... మూడో విడతలో మాత్రం అదే విధానాన్ని పాటించాలని చెప్పడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉన్న తరుణంలో వైరస్ బారిన పడిన వ్యక్తి తనకు తెలియకుండా ఈ-పాస్ యంత్రంపై వేలిముద్ర వేస్తే అందరికీ వైరస్ వ్యాపించే అవకాశం ఉందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు.