ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు బయోమెట్రిక్‌ - వాలంటీర్లకు బయెమెక్రిక్ హాజరు విధానం వార్తలు

ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానం సోమవారం నుంచి అమలులోకి తీసుకువచ్చారు.

bio-metric-attendance
సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు బయోమెట్రిక్‌

By

Published : Feb 11, 2020, 12:06 PM IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు బయోమెట్రిక్‌

ఇకపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల తరహాలోనే బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచి బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరిగా అమలు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ప్రత్యేక యాప్​ను ప్రభుత్వం రూపొందించింది. గ్రామ సచివాలయ పంచాయతీ కార్యదర్శి లాగిన్‌ నుంచి బయోమెట్రిక్‌ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఉదయం 10 గంటలకు, సాయంత్రం 5.30 గంటలకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details