గుంటూరు జిల్లా నారాకోడూరులో అరుదైన శ్రీతాళం వృక్షం చూసేందుకు జీవవైవిధ్య సంస్థ అధ్యక్షులు బీ.ఎం.కే.రెడ్డి వచ్చారు. శ్రీతాళం చెట్టు లక్షణాలను, దాని ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి నుంచి వివరాలు సేకరించి.. నమోదు చేసుకున్నారు. శ్రీతాళం విత్తనాలను జాగ్రత్త చేయటంతో పాటు వాటిని ఇతర ప్రాంతాల్లో నాటటం ద్వారా వృక్షజాతి అంతరించిపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
శ్రీతాళం వృక్షం పరిశీలించిన జీవవైవిధ్య సంస్థ అధ్యక్షులు - శ్రీతాళం చెట్టుని పరిశీలించిన జీవవైవిధ్య సంస్థ
గుంటూరు జిల్లా నారాకోడూరులో అరుదైన శ్రీతాళం వృక్షం ఉందనే విషయంపై ఈటీవి భారత్ లో వచ్చిన కథనంపై జీవవైవిధ్య సంస్థ స్పందించింది. ఏపీ జీవవైవిధ్య సంస్థ అధ్యక్షులు బీ.ఎంచూ.కే.రెడ్డి నారాకోడూరు వచ్చి వృక్షాన్ని పరిశీలించారు. .
bio diversity instite members test rare tree in guntur dst narakoduru