గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని వేలూరుడొంక ప్రాంతానికి చెందిన షేక్ ఖాదర్ వలీ... కోడి కత్తులు తయారు చేస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఖాదర్ వలీ ఇంట్లో ఉన్న 165 కోడి కత్తులను స్వాధీనం చేసుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకొని బైండోవర్ చేశారు.
పందెంకోడి కత్తులు తయారు చేస్తున్న వ్యక్తికి బైండోవర్ - chilakalooripeta crime news
గుంటూరు జిల్లా వేలూరిడొంక మార్గంలో... కోడి పందేలకు ఉపయోగించే కత్తులు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని చిలకలూరిపేట అర్బన్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుని నుంచి 165 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

పందెంకోడి కత్తులు తయారు చేస్తున్న వ్యక్తికి బైండోవర్