గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరుకి చెందిన గౌరీశంకర్... చెడు వ్యసనాలకు బానిసగా మారి దొంగతనాలు చేయటం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో తెనాలి, చెరుకుపల్లి, తాడికొండ, అమరావతి తదితర ప్రాంతాలలో చోరీలు చేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. తెనాలి పోలీసులు, గుంటూరు క్రైమ్ బృందం సహకారంతో అతనిని అరెస్ట్ చేశారు. గౌరీశంకర్ వద్ద నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వివరాలను ఎస్సై అనిల్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్టు - Guntur latest news
గుంటూరు జిల్లాలో పలు చోట్ల ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుడిని తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గౌరీశంకర్ వద్ద నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలను, రెండు వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెనాలి వన్‌టౌన్ ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.
బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్టు