ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దొంగ అరెస్ట్.. 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం - bike theif arrested

చిలకలూరిపేటలో నివసిస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న ఓ వ్యక్తిని పట్టణ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఆరు ద్విచక్ర వాహనాలు ఒక మోపెడు స్వాధీనం చేసుకున్నారు.

guntur district
ద్విచక్ర వాహనాలను దొంగ అరెస్ట్.. 7 వాహనాలు స్వాధీనం

By

Published : Jun 11, 2020, 11:55 AM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఆరు పెద్ద ద్విచక్ర వాహనాలు ఒక మోపెడు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నగరం శ్రీనగర్ కాలనీకి చెందిన సర్వేపల్లి అంకమ్మరావు కొంత కాలంగా చిలకలూరిపేట పట్టణం పాటిమీద నివాసం ఉంటున్నాడు. అందరితో కలివిడిగా ఉంటూ ద్విచక్ర వాహనాలు చోరీ చేసి వెంటనే నెంబర్ ప్లేట్లు మారుస్తూ వాటిని ఇతర ప్రాంతాలలో తక్కువ ధరకు విక్రయించే వాడు. ఇతనిని గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిఘా ఉంచిన అర్బన్ సీఐ సూర్యనారాయణ బుధవారం పట్టణంలోని చీరాల రహదారిలో దొంగలించిన వాహనంతో ఉన్న అంకమ్మరావును ఎస్సైలు షఫీ, రాంబాబు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఆరు పెద్ద ద్విచక్ర వాహనాలు ఒక మోపెడ్ స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details