ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బైక్ దొంగల ముఠాలు అరెస్టు... 36 ద్విచక్రవాహనాలు స్వాధీనం - guntur crime news

రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను దొంగిలించడం ఆ ముఠాకు అలవాటు. చోరీ చేసిన వాటిని విక్రయించి, వచ్చిన డబ్బులతో జల్సాలు చేయటాన్ని సరదాగా మార్చుకున్నారు ఆ ముఠా సభ్యులు. దొంగలు విక్రయించిన ఓ బైక్​కు పోలీసులు ఈ-చలాన్ విధించారు. ఇదే వారిని పట్టించింది. వాహన యజమాని ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు... ఈ-చలాన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా గుట్టు రట్టయింది.

బైక్ దొంగల ముఠాలు అరెస్టు... 36 ద్విచక్రవాహనాలు స్వాధీనం
బైక్ దొంగల ముఠాలు అరెస్టు... 36 ద్విచక్రవాహనాలు స్వాధీనం

By

Published : May 28, 2021, 8:49 PM IST

Updated : May 28, 2021, 9:18 PM IST

గుంటూరు జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న రెండు దొంగల ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 36 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాహనాల విలువ రూ.13లక్షలు ఉంటుందని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లాలోని మేడికొండూరు, లాలాపేట, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు నమోదైనట్లు ఎస్పీ వెల్లడించారు.

రోడ్ల పక్కన నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాలను ఈ ముఠా చాకచక్యంగా దొంగిలించి, విక్రయిస్తున్నట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. వీరు విక్రయించిన ఓ బైక్​కు ట్రాఫిక్ పోలీసులు ఛలానా విధించారు. చలాన్​కు సంబంధించిన సంక్షిప్త సమాచారం సంబంధిత వాహన యజమానికి వెళ్లింది. ఈ ఘటనతో షాక్​కు గురైన బాధితుడు... తన బైక్ దొంగతనానికి గురైందని, ఇప్పుడు జరిమానా కట్టాలని ఈ-చలాన్ విధించడం ఏమిటని మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాధితుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు... ఈ-చలాన్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఆ సమయంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని గుర్తించి విచారించగా... తాను ఎవరి వద్ద వాహనాన్ని కొనుగోలు చేశాడో వివరించాడు. అనంతరం పోలీసులు కూపీ లాగి.. దొంగల ముఠాను పట్టుకున్నారు. ఈ కేసు విచారణలో చొరవ చూపిన మేడికొండూరు పోలీసులను అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించారు.

ఇదీచదవండి.

Anandaiah: ఔషధ పరీక్షలపై రేపే చివరి నివేదిక: ఆయుష్‌ కమిషనర్‌

Last Updated : May 28, 2021, 9:18 PM IST

ABOUT THE AUTHOR

...view details