ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ముఠాను గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణాజిల్లా నాగాయతిప్ప గ్రామానికి చెందిన గరికపాటి రవితేజ, గరికపాటి అశోక్ అనే ఇద్దరు వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగిలించి వేరే ప్రాంతాల్లో అమ్మకానికి పెడుతున్నారు. ఇటీవల రేపల్లె మండల పరిధిలో పలుచోట్ల ద్విచక్ర వాహనాలు చోరీకి గురవటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 10 లక్షల విలువచేసే 8 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ముఠా అరెస్టు
ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ముఠాను గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 10 లక్షల విలువ చేసే 8 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ముఠా అరెస్టు