ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ చిలకడదుంప బరువెంతో తెలుసా..! - గుంటూరులో 5 కిలోల చిలకడదుంప

పెద్దదైనా చిలకడదుంపను ఎప్పుడైనా చూశారా..! పెద్దది అంటే అర కిలోనో..కిలోనో కాదు వాటికంటే ఐదు వంతుల పెద్దది. అంటే అక్షరాల 5 కిలోల వంద గ్రాములన్నమాటా..! ఎక్కడో చూస్తారా..!

big sweet potato at guntur
ఈ చిలకడదుంప బరువెంతో తెలుసా

By

Published : Mar 10, 2021, 9:34 AM IST

గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో మంగళవారం కిసాన్‌ మేళా జరిగింది. మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన రైతు కళ్ళం శ్రీనివాస్‌రెడ్డి... తాను పండించిన భారీ చిలకడ దుంపను ప్రదర్శనలో ఉంచారు.

సాధారణంగా చిలకడదుంప 100 గ్రాముల నుంచి అర కిలో వరకు బరువు ఉంటుంది. సేంద్రియ పద్ధతిలో పండించిన ఈ దుంప మాత్రం.. 5 కిలోల వంద గ్రాముల బరువు పెరిగిందని, దీనిని పరిశీలించిన కేవీకే శాస్త్రవేత్త గంగాదేవి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details