ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొంగిన చెరువు.. నిలిచిన రాకపోకలు

గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. మూడు రోజులుగా జిల్లాలో వానలు పడుతుండటంతో ప్రజలు, అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

By

Published : Sep 17, 2019, 9:54 PM IST

వాహనాలు

పొంగిన చెరువు.. నిలిచిన రాకపోకలు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు , పెదనందిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. దాదాపు గంటకు పైగా భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రత్తిపాడు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న చెరువులో నీరు పొంగి రహదారుల పైకి రావడంతో.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పత్తి , మిర్చి పొలాల్లో భారీగా నీరు చేరింది. మిర్చి పంట నీట మునిగింది. మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులలో ఆందోళన పెరుగుతోంది. కాకుమాను ఎంపీడీఓ కార్యాలయంలోకి వర్షపు నీరు చేరింది.

ABOUT THE AUTHOR

...view details