గుంటూరు జిల్లా తెనాలి శివాజీ చౌక్‌లో ఆకతాయిలు రెచ్చిపోయారు. స్వాతంత్య్ర సమరయోధుడైన భగత్‌సింగ్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో శివాజీ చౌక్ వద్ద భాజాపా, ఆర్ఎస్ఎస్, జనసేన ఇతర ప్రజాసంఘ నాయకులు ఆందోళనకు దిగారు. విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
తెనాలిలో భగత్‌సింగ్ విగ్రహం ధ్వంసం - tenali bhagat singh statue demolished news
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన భగత్‌సింగ్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది.
తెనాలిలో భగత్‌సింగ్ విగ్రహం ధ్వసం