ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆత్మహత్యకు ముందు.. కోడెల ఇంట్లో అసలేం జరిగింది? - kodela shivaprasada rao

కోడెల శివప్రసాదరావు.. ఆత్మహత్యకు ముందు ఏం చేశారు? గదిలోకి వెళ్లి ఏం చేశారు? ఆయన చనిపోయిన విషయాన్ని ఎవరు గుర్తించారు?

kodela

By

Published : Sep 16, 2019, 3:24 PM IST

Updated : Sep 16, 2019, 3:54 PM IST

కోడెల ఇంట్లో క్లూస్ టీం

శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు.. ఈ రోజు ఉదయం 10.30 గంటల సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సన్నిహుతులు అందించిన సమాచారం ప్రకారం..

  • కోడెల ఉదయం 10 గంటలకు భార్యతో కలిసి అల్పాహారం చేశారు.
  • 10.10 గంటలకు తన నివాసంలోని మొదటి ఫ్లోర్ లో ఉన్న పడకగదికి వెళ్లారు.
  • పడకగదిలోకి వెళ్లగానే తలుపు గడియపెట్టారు.
  • గది గడియపెట్టిన విషయాన్ని గుర్తించిన భార్య.. కోడెలను తలుపు తీయాల్సిందిగా కోరారు.
  • ఎంతకూ తలుపు తెరవకపోవడంపై.. అనుమానంతో వ్యక్తిగత గన్ మన్ ను పిలిచారు.
  • వెనక డోర్ బద్దలు కొట్టి గన్ మన్ భార్య లోనికి వెళ్లారు.
  • అప్పటికే ఫ్యాన్ కు కోడెల ఉరి వేసుకుని ఉన్నారు.
  • 10.40 గంటలకు కారులో కోడెలను ఆసుపత్రికి తరలించారు.
  • 10.50 గంటలకు బసవతారకం ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్థరించారు.
  • 11 గంటల తర్వాత ఆసుపత్రి సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు.
  • విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ సీఐ కళింగరావు.. ఎస్సై రాం రెడ్డిని ఆసుపత్రికి పంపించారు.
  • కోడెల ఆత్మహత్య చేసుకున్న గదిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
  • గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు.
  • డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, టాస్క్ ఫోర్స్ తో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Sep 16, 2019, 3:54 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details