ముఖ్యమంత్రి జగన్పై తెదేపా నేత బొండా ఉమామహేశ్వరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు ఒకలా.. వచ్చాక మరోలా సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, రాజధానిగా అమరావతి ఏర్పాటు, వివేకా హత్యకేసు విచారణ, 45 ఏళ్లకే పింఛన్, అమ్మఒడి అమలు హామీలపై జగన్ మాట తప్పి, మడపతిప్పాడని విమర్శించారు. అందుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. "జగన్ రెడ్డి.. ఏదినిజం, ఏది అబద్ధం. పాదయాత్రలో ఒకలా.. పార్టీ సమావేశాల్లో ఇంకోలా.. ఊరూరుకి మరోలా మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారం కోసం అడ్డగోలుగా హామీలిచ్చిన జగన్.. అధికారంలోకి రాగానే వాటన్నింటిని విస్మరించారు. రాజధానిగా అమరావతిని స్వాగతించిన మీరు ఇప్పుడెందుకు మాటమార్చారు. నాడు బాబాయి హత్యకేసులో సీబీఐ విచారణ కోరిన మీరు ఇప్పుడెందుకు హైకోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు" అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
'అధికారంలోకి రాకముందు ఒకలా..వచ్చాక మరోలా'
ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాకముందు ఒకలా.. వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఏది నిజం, ఏది అబద్ధం అంటూ జగన్ మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు.
తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు