బడా కంపెనీకి అనుకూలంగా బీచ్ శాండ్ టెండర్ నిబంధనలు- దరఖాస్తు ధరే రూ.5 లక్షలు! Beach Sand Tender Regulations in AP: బీచ్ శాండ్ లీజుల టెండర్‌ను ఓ బడా కంపెనీకి కట్టబెట్టేలా ప్రభుత్వ పెద్దలు మంత్రాంగం నడుపుతున్నట్లు తెలిసింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ రూపొందించిన నిబంధనలే ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. వాటిని ఆక్షేపిస్తూ బీచ్ శాండ్ ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శి సి.శక్తిగణపతి, మైన్స్ అండ్ మినరల్ బేస్డ్ వర్కర్స్ వెల్ఫేర్ సంఘం సదరన్ రీజియన్ అధ్యక్షుడు ఆర్.బాలకృష్ణన్ వేర్వేరుగా.. టెండర్లపై న్యాయ సమీక్ష చేస్తున్న న్యాయమూర్తికి లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది.
Sand Tender Terms in Favor of Big Company: శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని రెండు లీజుల్లో 909.85 హెక్టార్లు, విశాఖపట్నం జిల్లా భీమిలిలోని ఓ లీజులో 90.15 హెక్టార్లలో ప్రాజెక్ట్ డెవలపర్ అండ్ ఆపరేటర్ ఎంపికకు ఏపీఎమ్డీసీ టెండరు డాక్యుమెంట్లు సిద్ధం చేసింది. వాటిని సెప్టెంబరు 22న న్యాయసమీక్షకు పంపి.. అక్టోబరు 4లోపు అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలపాలని కోరింది. ఈ టెండర్లలో ఏపీఎమ్డీసీ పేర్కొన్న నిబంధనలను తీవ్రస్థాయిలో ఆక్షేపిస్తూబీచ్ శాండ్‌ఉత్పత్తిదారుల సంఘం, మైన్స్ అండ్ మినరల్ బేస్డ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాసిన లేఖలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అక్టోబరు 4నే ఈ లేఖల్ని మెయిల్ ద్వారా పంపగా.. తాజాగా వెలుగులోకి వచ్చాయి.
TDP Pattabhi Ram on Sand Tenders: టెండర్లలో గోల్ మాల్.. ఇసుకాసురుడు కాజేసిన వేల కోట్లు కక్కించే వరకూ విశ్రమించం: పట్టాభిరామ్
టెండరు దరఖాస్తు ధర 5 లక్షల రూపాయలు కాగా అదనంగా జీఎస్టీ ఉంటుందని చెప్పారు. కానీ ఏపీఎమ్డీసీ పిలిచిన ఇతర ఏ టెండర్లలోనూ ఇంత ఫీజు నిర్ణయించ లేదని.. ఔత్సాహిక, చిన్న పారిశ్రామికవేత్తలు ఎక్కువ మంది పాల్గొనకుండా అధిక ధర పెట్టారని.. బీచ్ శాండ్ ఉత్పత్తిదారుల సంఘం, మైన్స్ అండ్ మినరల్ బేస్డ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అభ్యంతరం తెలిపాయి.
దరఖాస్తు రుసుమును 50 వేలకు పరిమితం చేయాలని డిమాండ్ చేశాయి. టెండర్ దరఖాస్తు దాఖలు చేసినప్పుడు 10 కోట్ల రూపాయలను ధరావతుగా జమ చేయాలన్నారని.. ఇది చాలా పెద్ద మొత్తమని.. 50 లక్షల రూపాయలకు తగ్గించాలని కోరాయి. ఎంపికైన సంస్థ వారంలో 100 కోట్ల రూపాయలను జమ చేయాలనే నిబంధన పెట్టారని.. దీనివల్ల ఓ బడా కంపెనీ.. కొన్ని డొల్ల కంపెనీలతో కలిసి ఈ టెండరులో పాల్గొని దక్కించుకుంటుందని ఆయా సంఘాలు నేతలన్నారు.
లోపాయికారీ ఒప్పందంతోనే జేపీ వెంచర్స్‌కు ఇసుక టెండర్లు: తెదేపా
Beach Sand Tenders: ఇది ప్రభుత్వాలకు మంచిది కాదని.. ఈ మొత్తాన్ని 5 నుంచి 10 కోట్ల రూపాయలకు తగ్గించాలని కోరారు. ప్రభుత్వరంగ సంస్థలు టెండర్లు పిలిచినప్పుడు ఏయే మార్గదర్శకాలు పాటించాలనేదీ కేంద్ర విజిలెన్స్ కమిషన్ గతంలోనే పేర్కొంది కానీ.. బీచ్ శాండ్ టెండర్లలో వాటిని ఏపీఎమ్డీసీ పాటించలేదన్నారు. ఈ మూడు లీజులకు టెండరు దక్కించుకున్న సంస్థకు, మున్ముందు కేంద్రం మంజూరు చేసే మరో 13 లీజులు అప్పగించాలనే ప్రతిపాదన న్యాయబద్ధమైనది కాదన్నారు.
Sand Tenders in AP: మూడు లీజు ప్రాంతాల్లోని కొంతభాగంలో ఇప్పటికీ ఖనిజాన్వేషణ చేయలేదని.. టెండరు పొందినవారు ఖనిజాన్వేషణ చేయాల్సి ఉంటుందన్నారు. ఖనిజాన్వేషణ చేసిన కొంత భాగాన్ని పరిగణనలోకి తీసుకొని మొత్తం నిల్వల్ని టెండర్‌లో ఊహాజనితంగా పేర్కొన్నారని.. ఇది జూదంతో సమానమన్నారు. అక్కడ నిల్వలు ఆ మేరకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని పేర్కొన్నారు.
PATTABHI : 'ఇసుక టెండర్.. ఫిక్సింగ్ రాజా ఎవరో సీఎం చెప్పాలి'