నరసరావుపేట ప్రజలందరం కలసి మే 15 నాటికి పట్టణాన్ని కరోనా వైరస్ రహిత ప్రాంతంగా మార్చుకుందామని... బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. నరసరావుపేటలో కరోనా వైరస్ అధికమవుతున్న నేపథ్యంలో అధికారులు చేపడుతున్న మిషన్ మే 15 కార్యక్రమానికి మన వంతుగా సహకారాన్ని అందిద్దామన్నారు. మే 15 నాటికి పట్టణంలో కరోనా వైరస్ జీరోస్థాయికి తెచ్చేవిధంగా కృషి చేద్దామన్నారు. దొరికిన ఈ ఖాళీ సమయాన్ని వృథా చేసుకోకుండా... ఆన్లైన్ క్లాసులు ద్వారా విద్యా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
'నరసరావుపేటను కరోనా రహితంగా చేద్దాం' - బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ వార్తలు
మే 15నాటికి నరసరావుపేటను కరోనా రహిత ప్రాంతంగా మారుద్దామని... బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు.
!['నరసరావుపేటను కరోనా రహితంగా చేద్దాం' bcci selction committe former chairman msk prasad comments on narsarao peta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7081915-915-7081915-1588755386252.jpg)
బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎంఎస్కే ప్రసాద్
TAGGED:
నరసరావుపేట వార్తలు