ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం జగన్ బీసీలకు అండగా నిలుస్తున్నారు' - బీసీ కార్పొరేషన్లపై సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నో పథకాలు అందిస్తున్నారని బీసీ సంఘం నాయకులు ఆర్. కృష్ణయ్య కొనియాడారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

bc corporation chairman krishnayya on cm jagan
బీసీ సంఘం నాయకులు కృష్ణయ్య

By

Published : Oct 31, 2020, 11:13 PM IST

ముఖ్యమంత్రి జగన్ బీసీలకు సముచిత స్థానం కల్పించి అండగా నిలుస్తున్నారని బీసీ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీ కులాల అన్నింటికీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. ప్రతి కార్పొరేషన్ కు ఛైర్మన్ తో పాటు 12 మంది డైరెక్టర్లను నియమించటం అభినందనీయమన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన బీసీ కార్పొరేషన్ చైర్మన్ల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీసీలకు సంబంధించి కులవృత్తులకు రాయితీలు అందిస్తూ వారిని అభివృద్ధిలో నిలిపేందుకు జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details