Chaitanya rally in Guntur: మండల్ కమిషన్ సిఫార్సులు వెంటనే అమలు చేయాలని బీసీల ఉద్యమ నేత కేసన శంకర్రావు అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో చినరావూరు పార్కు నుంచి బీసీల హక్కుల కోసం చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓబీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని, కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ కేటాయించాలన్నారు. బీసీలు మాకు వెన్నుముకని జగన్ ప్రభుత్వం బీసీ జపం చేస్తున్నారని, కానీ కుల గణాంకాలు మాత్రం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. బీసీల సమస్యలపై ఢిల్లీలో నిరసన చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని, తెనాలి నుంచి ప్రారంభమైన పోరాటం 23 జిల్లాలకు వ్యాప్తి చేస్తామన్నారు. బీసీ కుల గణాంకాలు చేపట్టి వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని చినరావూరు పార్కు నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ వరకు కొనసాగించారు.
ఓబీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి: కేసన శంకర్రావు - Guntur Latest News
Chaitanya rally in Guntur: బీసీల హక్కుల కోసం మండల్ కమిషన్ సిఫార్సులు వెంటనే అమలు చేయాలని బీసీల ఉద్యమ నేత కేసన శంకర్రావు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో చినరావూరు పార్కు నుంచి బస్టాండ్ వరకు చైతన్య ర్యాలీ కొనసాగించారు. తెనాలి నుంచి ప్రారంభమైన పోరాటం 23 జిల్లాలకు వ్యాప్తి చేస్తామన్నారు.
Chaitanya rally in Guntur