సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా జరిగే బతుకమ్మ సంబరాలు గుంటూరు జిల్లా పల్నాడులోని పలు పల్లెలతో పాటు మాచర్ల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆడపడుచులు ఏటా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అన్ని ప్రాంతాల మహిళలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ఇక్కడ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రా సంప్రదాయాలను మేళవించి పల్నాడులోని మహిళలు జరిపే ఈ బతుకమ్మ సంబరాలు ఆధ్యాత్మికత తోపాటు ఐక్యతకు దోహదపడతాయని మహిళలు పేర్కొంటున్నారు.
పల్నాడులోని పలు పల్లెల్లో బతుకమ్మ వేడుకలు - Palnadu latest news
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెప్పునే గౌరమ్మ.. అంటూ ఆ ఆడపడుచులు పాడే పాటలు.. చేసే నృత్యాలు.. ఆ పల్లెకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంటాయి. బతుకు చిత్రాన్ని తెలిపేది బతుకమ్మ. అందులోని ఆటపాట సామాన్యుల జీవితాన్ని తెలియజేస్తుంది. అందుకే ఈ బతుకమ్మ సంబరాలు కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న పల్నాడులోను జరుపుకుంటారు.
పల్నాడులోని పలు పల్లెల్లో బతుకమ్మ వేడుకలు