కరోనా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన క్షురకులకు ప్రభుత్వం నెలకు 10వేల రూపాయలు ఇవ్వాలని నాయిబ్రాహ్మణుల సంఘం డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో నాయిబ్రాహ్మణుల సంఘం నాయకులు సెలూన్ ల వద్ద కుటుంబసభ్యులతో కలసి ఆందోళన చేశారు. .లాక్ డౌన్ వల్ల గత రెండు నెలల నుంచి ఉపాధి కోల్పోయామని నాయిబ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని కోరారు. ఆటో డ్రైవర్ లకు ఇస్తున్నట్లే తమకు 10వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
నాయిబ్రాహ్మణుల ఆందోళన...ఆదుకోవాలని డిమాండ్ - corona list in guntur dst
లాక్ డౌన్ కారణంగా సెలూన్ షాపులు మూతపడటంతో క్షురకుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం తమకు 10వేలు ఇచ్చి ఆదుకోవాలని నాయిబ్రాహ్మణులు సంఘం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆందోళన చేశారు.
barbers protest in guntur dst about corona issue