ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాక్టర్ ప్రమాద బాధితులకు బాపట్ల ఎంపీ పరామర్శ - బాపట్ల ఎంపీ నందిగామ సురేష్

గుంటూరు జిల్లా పరిమిలో గురువారం జరిగిన ట్రాక్టర్ ప్రమాద బాధితులను బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ పరామర్శించారు. విషాదం జరిగిన రోజు నలుగురు మృతి చెందగా... ఇవాళ మరో ఇద్దరు చనిపోయారు.

bapatla-mp-nandigama
గుంటూరు ట్రాక్టర్ ప్రమాద బాధితులకు బాపట్ల ఎంపీ పరామర్శ

By

Published : Feb 21, 2020, 7:19 PM IST

గుంటూరు ట్రాక్టర్ ప్రమాద బాధితులకు బాపట్ల ఎంపీ పరామర్శ

గుంటూరు జిల్లా చుండూరు మండలం పరిమిలో ట్రాక్టర్​ బోల్తా పడిన ప్రమాదంలో నిన్న నలుగురు మృతి చెందగా ఇవాళ మరో ఇద్దరు చనిపోయారు. బాధితుల్ని తెనాలి గవర్నమెంట్ ఆసుపత్రిలో బాపట్ల ఎంపీ నందిగామ సురేశ్ పరామర్శించారు. ప్రమాదం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 7లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ. 50 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ఎంపీ తెలిపారు.

ఇవీ చూడండి-పెళ్లి బాజా విన్న కాసేపటికే... చావు చప్పుళ్లు పలకరించాయి

ABOUT THE AUTHOR

...view details