రైతు భరోసా కేంద్రాల్లో త్వరలో బ్యాంకింగ్ సర్వీసులు నిర్వహిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ సాయి లక్ష్మీశ్వరి చెప్పారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం హబ్‌ను ఆమె పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. 9600 కేంద్రాల్లో కియోస్క్ యంత్రాలు ఉన్నాయని.. మిగిలిన చోట్ల త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వీటి ద్వారా అందజేస్తామన్నారు. అన్నదాతలకు క్రెడిట్ కార్డులు ఇస్తామన్నారు. 14 మంది నాణ్యత లేని విత్తనాల డీలర్లకు షోకాజ్ నోటీసులు అందజేసినట్లు చెప్పారు. ప్రతి రైతు ఈక్రాప్ బుకింగ్ చేసుకోవాలని జేడీఏ విజయభార్గవి సూచించారు.