ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో కొనసాగుతున్న బంద్

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ పోరాట సమితి రాష్ట్రవ్యాప్తంగా బంద్​కు పిలుపునిచ్చింది. ఈ బంద్​కు భాజపా మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. గుంటూరులోనూ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

bandh at guntur district
గుంటూరులో కొనసాగుతున్న బంద్

By

Published : Mar 5, 2021, 2:13 PM IST

88 సర్వీసులు నిలిపివేత..!

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలంటూ విశాఖ పోరాట సమితి పిలుపు మేరకు రాష్ట్రంలో బంద్ నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మొత్తం 88 బస్సు సర్వీసులు నిలిపివేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అన్ని డిపోలకి బస్సులు పరిమితమయ్యాయి. విధులకు హాజరైన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సిబ్బందికి డిపో మేనేజర్ సూచనలు చేశారు.

గుంటూరులో కొనసాగుతున్న బంద్

పోలీసుల బందోబస్తు

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ గుంటూరులో బంద్ జరుగుతోంది. ముందు జాగ్రత్తగా ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. తెదేపా, వామపక్షాలు కూడా బంద్​కు మద్దతు ప్రకటించాయి. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు.
ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. వర్తక వాణిజ్య సముదాయాలు తెరచుకోలేదు.

స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు

రాష్ట్ర బంద్ సందర్భంగా గుంటూరులో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిరసిస్తూ జరుగుతున్న బంద్​లో వామపక్షాలు పాల్గొన్నాయి. వామపక్షాల నేతలు, కార్యకర్తలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. వర్తక, వాణిజ్య సముదాయాలు మూసివేయించారు. శంకర్ విలాస్ కూడలిలో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. టైర్లలో గాలి తీసేందుకు యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం రహదారిపై ఆందోళన చేయటంతో శంకర్ విలాస్ పై వంతెన మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు వాహనాలు దారి మళ్లించారు. ఆందోళనకారులు రోడ్డుపై నుంచి లేవకపోవటంతో పోలీసులు వారిని బలవంతంగా స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే విశాఖ కర్మాగారానికి ఇనుప ఖనిజం గనులు కేటాయించటం ద్వారా పరిశ్రమను నిలబెట్టాలని సూచించారు.

ఇదీ చూడండి.

రాష్ట్ర బంద్‌: డిపోలకే పరిమితమైన బస్సులు

ABOUT THE AUTHOR

...view details