ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని గ్రామాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్ - రైతుల అరెస్ట్ వార్తలు

రాజధాని గ్రామాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద రహదారిపై రైతుల నిరసన చేపట్టారు. 29 గ్రామాల్లో అమరావతి ఐకాస బంద్‌కు పిలుపునిచ్చింది.

bandh at capital villages
రాజధాని గ్రామాల్లో ప్రశాంతంగా కొనసాగుతోన్న బంద్

By

Published : Nov 1, 2020, 11:30 AM IST


జైల్​ భరో కార్యక్రమంలో మహిళలపై పోలీసులు చేసిన దాడిని నిరసిస్తూ ఐకాస నేతలు బంద్​కు పిలుపునిచ్చారు. బంద్​లో భాగంగా రాజధాని గ్రామాలలో అన్నదాతలు ఆందోళనలను ఉద్ధృతం చేశారు. మందడంలో దుకాణాలు రైతులు దగ్గరుండి మూయించారు. కృష్ణాయపాలెంలో మహిళలు, రైతులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానులు మద్దతుగా ఆందోళన చేస్తున్న వారిని వెంటనే బయటికి పంపించాలని ... లేకపోతే సోమవారం నుంచి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details