గుంటూరు జిల్లా కాకుమానులో ఎన్నికల సామగ్రి పంపిణీలో ఆలస్యమైంది. రాత్రి కావడంపై అధికారులు అప్పటికప్పుడు విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేశారు. అయితే అవి పూర్తిస్థాయిలో లేని కారణంగా... సామగ్రిని సెల్ ఫోన్ లైట్ వెలుగులతో ఎన్నికల సిబ్బంది చూసుకోవాల్సి వచ్చింది. బ్యాలెట్ పేపర్లు ముద్ర, పేర్లు పరిశీలనలో కొంత ఇబ్బంది పడ్డారు.
సెల్ ఫోన్ లైట్ల వెలుగులో బ్యాలెట్ పేపర్ల పరిశీలన
గుంటూరు జిల్లా కాకుమానులో ఎన్నికల సిబ్బంది.. సెల్ ఫోన్ లైట్ల వెలుగులో బ్యాలెట్ పేపర్లు పరిశీలిస్తున్నారు. పరిషత్ ఎన్నికల నిర్వహణపై కోర్టులో తీర్పు వెలువడే వరకు వేచి చూడాల్సి రావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.
సెల్ ఫోన్ లైట్ల వెలుగులో బ్యాలెట్ పేపర్లు పరిశీలన