గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సినీ హీరో బాలకృష్ణ 60వ జన్మదిన సందర్భంగా కంటైన్మెంట్ జోన్ లో ఉన్న 160 కుటుంబాలకు నిత్యావసర సరకుల పంపిణీకి తెదేపా నేతలు ముందుకు వచ్చారు. 7 రకాల సరకులు బ్యాగ్ లో పెట్టి బాలకృష్ణ, ఎన్టీఆర్ ఫొటోలతో ఉన్న స్టిక్కర్లు అంటించారు. ఈ విషయాన్ని స్థానిక వాలంటీర్ పంచాయతీ కార్యదర్శికి చెప్పారు. స్టిక్కర్లు ఉన్న వాటిని పంపిణీ చేసేందుకు వీలు లేదని ఆయన చెప్పారు. విషయాన్ని తహశీల్దార్ పూర్ణచంద్రరావు దృష్టికి తెదేపా నేతలు తీసుకెళ్లారు. బాలకృష్ణ జన్మదిన సందర్భంగా చేస్తున్నామని చెప్పగా.. తహశీల్దార్ సానుకూలంగా స్పందించారు. పంచాయతీ కార్యదర్శి మాత్రం ఇందుకు నిరాకరించాడు. ఇటీవల వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి తరుపు నాయకులు కంటైన్మెంట్ జోన్లోకి సరకులు ఎలా పంపిణీ చేశారని తెదేపా నేత శివరామ ప్రసాద్ గట్టిగా ప్రశ్నించారు. చివరకు ట్రాక్టర్ కు ఉన్న బాలకృష్ణ ఫ్లెక్సీ తొలగించిన తరువాత పోలీసులు పంపిణీకి అనుమతిచ్చారు.
వారి ఫొటోలు ఉంటే సరకుల పంపిణీ ఆపండి - గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు
బాలకృష్ణ, ఎన్టీఆర్ ఫొటోలు, స్టికర్లు అంటించిన నిత్యావసర సరకులు పంపిణీ చేయటానికి వీలులేదని పంచాయతీ కార్యదర్శి వాలంటీర్ తో చెప్పించటంతో ప్రత్తిపాడులో వివాదం చెలరేగింది.
వారి ఫోటోలు ఉంటే సరుకుల పంపిణీ ఆపండి