సినీ హీరో, హిందూపురం తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరు తెదేపా కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నటుడిగా, ప్రజాప్రతినిధిగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని తెదేపా నేత చిట్టిబాబు ప్రశంసించారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంటోందన్నారు.
'నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు ' - అమరావతిలో బాలకృష్ణ జన్మదినం
సినీనటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలను.. అభిమానులు, నేతలు, పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని చాటారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా బాలయ్య తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు. ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Breaking News
అమరావతి ఎన్టీఆర్ భవన్లోనూ బాలకృష్ణ జన్మదిన సంబరాలు జరిగాయి. ఎమ్మెల్సీ అశోక్ బాబు కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగాల్లో నిబద్ధతతో పనిచేసే వ్యక్తి బాలయ్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి... విశాఖలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు