నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ( Narsapuram Mp Raghurama KrishnaRaju ) బెయిల్‌కు సంబంధించిన పత్రాలను ఆయన తరఫు న్యాయవాదులు ( Guntur Cid Magistrate ) గుంటూరు సీఐడీ మెజిస్ట్రేట్‌కు అందజేశారు.
పలు సెక్షన్ల కింద అభియోగాలు..
రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారని సీఐడీ పోలీసులు ( Raghuramakrishna) రఘురామకృష్ణరాజుపై రాజద్రోహంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇప్పటికే బెయిల్ మంజూరు..
ఈ కేసులో ఇప్పటికే రఘురామకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని సైనిక ఆస్పత్రి ( Secunderabad Military Hospital )లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో ఈ నెల 24న న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పూచికత్తు పత్రాలు, డిపాజిట్లను సమర్పించారు.