ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయసాయిరెడ్డిపై పోస్టులు చేసిన తెదేపా కార్యకర్తలకు బెయిల్ - గుంటూరులో తెదేపా కార్యకర్తలు విడుదల

ఎంపీ విజయసాయిరెడ్డిని కించపరిచే విధంగా పోస్టులు పెట్టి.. అరెస్టయిన తెదేపా కార్యకర్తలు నేడు విడుదలయ్యారు. తెదేపా నేత చిట్టిబాబు పూచికత్తుతో పోలీసులు వారిని బెయిల్​పై విడుదల చేశారు.

తెదేపా కార్యకర్తలకు బెయిల్
తెదేపా కార్యకర్తలకు బెయిల్

By

Published : May 19, 2021, 4:10 PM IST

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు అరెస్టయిన తెలుగుదేశం కార్యకర్తలు.. వెంకట్ మహేష్, కళ్యాణ్ విడుదలయ్యారు. యూట్యూబ్ ఛానల్లో వచ్చిన పోస్టులపై వైకాపా నేత పానుగంటి చైతన్య గుంటూరు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మహేష్, కళ్యాణ్​ను మంగళవారం.. పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుదేశం నేత చిట్టిబాబు వారిద్దరికీ వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వడంతో... ఇవాళ వారిద్దరిని బెయిల్ పై విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details