మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందతున్న న్యాయవాది కిశోర్‌ను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఆయనతో పాటు హైకోర్టు న్యాయవాదులు కిశోర్‌ను పరామర్శించిన వారిలో ఉన్నారు. దాడి వివరాలను చంద్రబాబు తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు ప్రజలు మేలుకోవాలని పిలుపునిచ్చారు. రక్తం ధారగా పడుతున్నా.. విధి నిర్వహణలో వెనక్కు తగ్గకుండా కిశోర్ పోరాడారని ప్రశంసించారు.
గాయపడిన న్యాయవాదికి చంద్రబాబు పరామర్శ - babu met lawyer kishore in mangalagiri nri hospital news
మాచర్ల దాడి ఘటనలో గాయపడిన న్యాయవాది కిశోర్‌ను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

గాయపడిన న్యాయవాదిని పరామర్శించిన చంద్రబాబు
TAGGED:
babu nri hospital