అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలోని ఎన్నారై కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదం నుంచి రక్షణ పొందటం, బాధితులను కాపాడటం తదితర అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.
అనంతపురం జిల్లాలో...
ఉరవకొండలో పలువురిని అబ్బురపరిచే విధంగా అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్నాయి. అగ్నిమాపక శాఖ ఉపయోగించే పరికరాలు, పనితీరును డెమోల ద్వారా ప్రజలకు తెలియజేశారు. గ్యాస్ సిలిండర్ లీక్ అయిన సమయంలో దాన్ని ఏ విధంగా ఆర్పివేయాలన్న విషయంపై... స్థానిక వివేకానంద పాఠశాల విద్యార్థులకు వివరించారు.
విశాఖపట్నంలో...
బహుళ అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించే అంశాన్ని ప్రదర్శించారు. సీతమ్మధారలోని 35 అంతస్తుల భవనంలో.. బాధితులను రక్షించే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో ఏవిధంగా వ్యవహరించాలనేది చెప్పారు.
కడపలో...
అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అగ్నిమాపక అధికారి బసిరెడ్డి అన్నారు. జేఎంజే కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో ఎక్కువగా గ్యాస్ ప్రమాదాలు జరుగుతున్నాయని మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి:
న్యాయవాదుల చిరు ప్రయత్నం.. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం