ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్లాస్మా దానంతో నలుగురి ప్రాణాలు కాపాడవచ్చు.. - గుంటూరు జిల్లా తాజా వార్తలు

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్లాస్మా దానం పై అవగాహన కార్యక్రమం జరిగింది. ప్లాస్మా దానం చేయటం వల్ల మరో నాలుగు ప్రాణాలు కాపాడవచ్చని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు.

తాడికొండలో ప్లాస్మా దానం పై అవగాహన కార్యక్రమం
తాడికొండలో ప్లాస్మా దానం పై అవగాహన కార్యక్రమం

By

Published : Aug 19, 2020, 12:15 PM IST

మానవ సేవే మాధవ సేవగా భావించి ప్లాస్మా దానం చేయాలని తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్లాస్మా దానం పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీదేవి మాట్లాడుతూ... ప్లాస్మా దానం చేయడం వల్ల నాలుగు ప్రాణాలు కాపాడవచ్చన్నారు.

కరోనా కట్టడికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని... వైరస్ బారిన పడిన రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని శ్రీదేవి తెలిపారు. ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా కురుస్తున్ననందున సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. సీజనల్ వ్యాధులు బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీదేవి సూచించారు.

ఇవీ చదవండి:అనధికారికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు.. ప్రైవేట్ ల్యాబ్​లలో భారీ వసూళ్లు

ABOUT THE AUTHOR

...view details