గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే కార్యాలయంలో జీడీసీసీ బ్యాంకు సేవలపై అవగాహన కార్యక్రమం జరిగింది. డ్వాక్రా మహిళల్లో చైతన్యం నింపేందుకు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి మెప్మా సిబ్బంది, డీఆర్‌డీఏ సిబ్బంది హాజరయ్యారు. జీడీసీసీ బ్యాంకు జనరల్ మేనేజర్ శేషుభాను బ్యాంకు అందించే రాయితీలు ఉపయోగించుకుని మహిళలు అభివృద్ధి చెందాలన్నారు. తాము ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకం లక్ష్యం మహిళల సాధికారతే అని గుర్తు చేశారు. బ్యాంకు ద్వారా డ్వాక్రా మహిళలకు చేయూతనందించేందుకు రుణాలు అందజేయబోతున్నామని వెల్లడించారు. అన్ని బ్యాంకులకంటే అతి తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. డ్వాక్రా మహిళలకు గ్రూపు రుణాలతోపాటు, వ్యక్తిగత రుణాలు అందజేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు.
డ్వాక్రా మహిళల చేయూతకు జీడీసీసీ బ్యాంకు రుణాలు
జీడీసీసీ బ్యాంకు అందించే రుణాలతో డ్వాక్రా మహిళలు అభివృద్ధి చెందాలని వినుకొండ జీడీసీసీ బ్యాంకు జనరల్ మేనేజర్ అన్నారు. తమ బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేస్తామన్నారు. తద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.మహిళలు తప్పకుండా ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని కోరారు.
డ్వాక్రా మహిళల చేయూతకు జీడీసీసీ బ్యాంకు రుణాలు