గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చిత్రలేఖన ఉపాధ్యాయుడు ప్రకాష్ తన సహచర ఉపాధ్యాయులతో కలిసి స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై చిత్రాలతో అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్ కరోనాపై పోరాడుతున్నారని.. అందుకుగానూ సీఎం పెయింటింగ్‌కు శ్రీకారం చుట్టానని తెలిపారు. 78 అడుగుల పొడవు 154 అడుగుల వెడల్పుతో మొత్తం 12.012 అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద పెయింటింగ్ వేస్తున్నారు. గంటల్లో పూర్తి చేయాలనుకున్నా.. బొమ్మ గీయడానికి కొంత సమయం పడుతుండటంతో రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తానని తెలిపారు.
కరోనాపై పోరాడుతున్న సీఎంకు ప్రేమతో..! - గుంటూరులో సీఎం చిత్రంతో కరోనాపై అవగాహన
కరోనా వ్యాప్తి నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూపుతున్న చొరవకు కృతజ్ఞతగా గుంటూరు జిల్లాకు చెందిన ఓ చిత్రలేఖన ఉపాధ్యాయుడు పెయింటింగ్ వేస్తున్నాడు. చిత్రాన్ని రెండు, మూడు రోజుల్లో పూర్తి చేస్తానని తెలిపాడు.
Awareness on the corona with the image of CM at thenali in guntur