నకిలీ శానిటైజర్లను వినియోగించడం వల్ల చర్మ వ్యాధులతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని గుంటూరు జిల్లా కన్స్యూమర్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ - గర్తపురి కన్స్యూమర్స్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ హరిబాబు అన్నారు. గుంటూరు రైతు బజార్ సెంటర్లో శానిటైజర్ల ఉపయోగంపై అవగహన కార్యక్రమం నిర్వహించారు. వీటిని కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
శానిటైజర్ల వినియోగంపై అవగాహన కార్యక్రమం - guntur news today
కరోనా కారణంగా శానిటైజర్ల వినియోగం పెరిగింది. మార్కెట్లలో వివిధ రకాల శానిటైజర్లు లభిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు అక్రమార్కులు వీటినీ కల్తీ చేస్తున్నారు. ఫలితంగా నకిలీ శానిటైజర్లను వినియోగించిన వారు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
శానిటైజర్ల వినియోగంపై అవగాహన కార్యక్రమం